TSLPRB | ఈ నెల 18 నుంచి కానిస్టేబుల్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గురువారం నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం తెలిపింది. ఉదయం 8 గంటల నుంచి ఆగస్ట్ అర్ధరాత్రి 12 గంటల వరకు www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని బోర్డు పేర్కొంది. ఈ హాల్ టికెట్లకు సంబంధించి ఏవైనా సందేహాలున్నా, డౌన్లోడ్ కాకపోయినా.. support@tslprb.inకి మెయిల్ చేయాలని.. లేదంటే 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా 15,644 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం టీఎస్ఎల్పీఆర్బీ గత ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విధితమే. కానిస్టేబుల్ పోస్టులతో రవాణాశాఖలో 63 కానిస్టేబుల్, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్లో 614 కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఆయా పోస్టులకు సంబంధించి ప్రాథమిక పరీక్ష ఈ నెల 28న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగనున్నది. ఆయా కానిస్టేబుల్ పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.