కరోనా దహనాలకు కట్టెల కొరత.. తీర్చేందుకు టీఎస్ఎఫ్డీసీ నిర్ణయం

హైదరాబాద్ : కరోనా విపత్తు నేపథ్యంలో తమ వంతుగా మానవతా దృక్పథంతో సహాయం అందించాలని నిర్ణయించింది తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎఫ్డీసీ). కొవిడ్ కారణంగా అధిక సంఖ్యలో నమోదవుతున్న మరణాలు, స్మశానాల్లో మృతుల దహనానికి కట్టెల కొరత తీవ్రంగా ఉందన్న వార్తల నేపథ్యంలో ఫారెస్ట్ కార్పోరేషన్ స్పందించింది. తమ పరిధిలో ఉన్న సుమారు వెయ్యి టన్నుల కలపను ఉచితంగా సరఫరా చేస్తామని అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.
సుమారు వెయ్యి టన్నుల కలపను హైదరాబాద్‌తో సహా సమీప మున్సిపాలిటీల స్మశానాలకు సరఫరా చేస్తామని ఎఫ్డీసీ ప్రకటించింది. పెరిగిన కలప ధరలు కూడా పేదలకు భారంగా పరిణమించటంతో మానవతా దృక్పథంలో సహాయం చేయాలన్న ఆలోచనతో రూ. 20 లక్షల విలువైన కలపను ఉచితంగా అందించేందుకు ముందుకు వచ్చినట్లు ప్రతాప్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ మిగతా పట్టణాల్లో స్థానిక మున్సిపల్ అధికారులతో సమన్యయం ద్వారా కలపను అందించే ఏర్పాట్లు చేస్తామని కార్పోరేషన్ వైస్ చైర్మన్, ఎండీ జి. చంద్రశేఖర రెడ్డి తెలిపారు. రంగారెడ్డి డివిజన్లో 350 టన్నుల కలప, ఖమ్మం-సత్తుపల్లి- అశ్వారావుపేట-భద్రాచలం డివిజన్లలో 400 టన్నులు, మంచిర్యాల- కాగజ్ నగర్ లలో 860 టన్నులు, వరంగల్ డివిజన్ లో 200 టన్నుల కలప అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అంత్యక్రియలకు అవసరమైన వెదరును కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
హైదరాబాద్ పరిధిలో అంబర్‌పేట, బన్సీలాల్‌పేట, ఆసిఫ్‌నగర్, ఈ.ఎస్.ఐ స్మశాన వాటికలకు ఈ వారంలో కలప తరలిస్తామన్నారు. తమ వారి అంత్యక్రియలకు అవసరమైన కలప లభ్యత లేని పేదలు స్థానిక మున్సిపల్ అధికారులను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. కలపను తరలించేందుకు స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చినట్లు చంద్రశేఖర రెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

