హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి ఫేజ్లో అభ్యర్థులకు అలాట్ చేసిన సీట్లు క్యాన్సిల్ చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 28. ఆన్లైన్లో అభ్యర్థుల దరఖాస్తు, ఫీజు చెల్లింపుల కోసం ఈ నెల 25, 26వ తేదీల్లో స్లాట్ బుకింగ్లు జరగనున్నాయి.
అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 27న జరుగుతుంది. ఈ నెల 27 నుంచి 30 వరకూ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. నవంబర్ 9, 10వ తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి.