ఎట్టకేలకు టెట్ ఫలితాలు విడుదల
ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. రాత్రి 8:30గంటల తర్వాత ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచారు.
- సోమవారం రాత్రి అరగంటపాటు వెబ్సైట్లో రిజల్ట్స్
- ఆ తర్వాత తొలగింపు
- టెస్టింగ్స్‌లో భాగంగా జరిగిందని విద్యాశాఖ ప్రకటన
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ) : ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు మంగళవారం రాత్రి విడుదలయ్యాయి. రాత్రి 8:30గంటల తర్వాత ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. ఆ ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచారు. ఫలితాల కోసం https://schooledu.te langana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అయితే కొంతసేపు సాంకేతిక కారణాలతో సైట్ మొరాయించడం గమనార్హం. కాగా సోమవారం రాత్రి 11:30 గంటలకు అకస్మాత్తుగా వెబ్సైట్లో అరగంట పాటు టెట్ ఫలితాలు ప్రత్యక్షమయ్యాయి.
వందలాది మంది(10%) అభ్యర్థులు ఫలితాలు చెక్ చేసుకున్నారు కూడా. ఓ అరగంటకే అకస్మాత్తుగా వెబ్సైట్ నుంచి టెట్ ఫలితాలు తొలగించారు. మిగతా అభ్యర్థులు ఫలితాలు చెక్‌చేసుకుంటే ‘రిజల్ట్స్ డిసెబుల్’ అంటూ కనిపించింది. టీజీ ఆన్లైన్ అధికారులు విద్యాశాఖ నుంచి ఎలాంటి అనుమతి పొందకుండానే ఫలితాలను వెబ్సైట్లో పొందుపరిచినట్టు విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. టీజీ ఆన్లైన్ మీద క్రిమినల్ కేసు నమోదుచేస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే విషయంపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ స్పందిస్తూ టెస్ట్ ట్రయల్స్‌లో భాగంగా ఫలితాలు ప్రత్యక్షమయ్యాయని చెప్పారు. తాము అధికారికంగా ఫలితాలు విడుదల చేయలేదని పేర్కొన్నారు.
టెట్‌లో 51.37% క్వాలిఫైడ్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల్లో మొత్తం 51.37% మంది అర్హత సాధించారు. పేపర్-1 ఎస్టీజీలు 72%, పేపర్-2 (గణితం, సైన్స్)లో 42.37%, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 35.86% మంది టెట్ క్వాలిఫై అయ్యారు. ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు పేపర్-1లో 77.04%, పేపర్-2 (గణితం, సైన్స్)లో 49.13%, పేపర్-2 (సోషల్ స్టడీస్)లో 33.64% మంది టెట్‌లో అర్హత సాధించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

