TS TET | వెబ్సైట్లో అందుబాటులో టీఎస్ టెట్ హాల్ టికెట్లు
TS TET | టీఎస్ టెట్ (TS TET) హాల్‌టికెట్లు (Hall Tickets) విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. ఈనెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. తమ హాల్ టికెట్‌పై ఫోటో రానిపక్షంలో.. పాస్‌పోర్టు సైజు ఫోటో అతికించి, గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించాలి.
TS TET | హైదరాబాద్: టీఎస్ టెట్ (TS TET) హాల్‌టికెట్లు (Hall Tickets) విడుదలయ్యాయి. అధికారిక వెబ్సైట్లో హాల్‌టికెట్లను పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. ఈనెల 15న టెట్ పరీక్ష జరుగునుంది. తమ హాల్ టికెట్‌పై ఫోటో రానిపక్షంలో.. పాస్‌పోర్టు సైజు ఫోటో అతికించి, గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం చేయించాలి. అనంతరం ఆ హాల్ టికెట్‌ను డీఈవోకి సమర్పిస్తే, పరిశీలించి పరీక్షకు అనుమతి ఇస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://tstet.cgg.gov.inలో రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీని నమోదుచేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
15న ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను ఈ నెల 27న వెల్లడించనున్నారు. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టు 1న విడుదలైన విషయం తెలిసిందే. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 2 నుంచి 16 వరకు జరిగింది. మొత్తం 2,83,620 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. టెట్‌కు 20 శాతం వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో చైల్డ్ డెవలప్మెంట్కు 30 మార్కులు, జనరల్ తెలుగు 30 మార్కులు, ఇంగ్లిష్ 30, మిగిలిన సబ్జెక్టులకు 60 మార్కుల చొప్పున కేటాయించారు.
కాగా, ఉపాధ్యాయ నియామక పరీక్ష డీఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 5089 పోస్టులను భర్తీ చేస్తున్నది. దీనికి సంబంధినంచిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 20 నుంచి 30 వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం పట్టణాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

