TS SET | టీఎస్ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు..
TS SET | తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.
TS SET | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్షకు దరఖాస్తుల గడువును పొడిగిస్తున్నట్టు టీఎస్ సెట్ అధికారులు వెల్లడించారు. టీఎస్ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 29తో ముగియగా, అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత కోసం టీఎస్ సెట్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రూ. 1500 ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 10వ తేదీ వరకు, రూ. 2 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 18 వరకు, రూ. 3 వేల ఆలస్య రుసుంతో సెప్టెంబర్ 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు ఆలస్య రుసుంకు అదనం. సెప్టెంబర్ 26, 27 తేదీల్లో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అక్టోబర్ 20 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 28, 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూల్, కరీంనగర్, తిరుపతి, మహబూబ్‌నగర్, మెదక్, వైజాగ్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తుల కోసం www.telanganaset.org అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

