TS Inter Hall Tickets | వెబ్సైట్లో ఇంటర్ హాల్ టికెట్లు.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..
TS Inter Hall Tickets | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా.. తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు.
TS Inter Hall Tickets | హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే హాల్ టికెట్లను కాలేజీ లాగిన్ ఐడీలో పొందుపరిచగా.. తాజాగా ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. విద్యార్థులు www.tsbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించి తమ తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పదో తరగతి లేదా ఇంటర్ ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్‌తో థియరీ పరీక్షల హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇక సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్టియర్ లేదా రెండో ఏడాది హాల్ టికెట్ నంబర్‌తో డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత విద్యార్థులు అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలని శృతి ఓజా సూచించారు. ఏవైనా పొరపాట్లుంటే వెంటనే డీఐఈవోలను సంప్రదించి సరిదిద్దుకోవాలన్నారు. ఇక ఈ హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా ఫర్వాలేదని.. ఆయా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లను ఆదేశించారు. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

