TS Inter Results | ఈ నెల 24న ఇంటర్ ఫలితాలు
TS Inter Results | తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది.
TS Inter Results | తెలంగాణ ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ సోమవారం వెల్లడించింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఒకేసారి ప్రకటించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన విషయం తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్లో కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 10వ తేదీ వరకు మూల్యాంకణం పూర్తయ్యింది. అయితే, మార్కుల నమోదు పాటు సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవకుండా అధికారులు జాగ్రత్తలు చేపట్టారు.
జవాబుపత్రాలను మూడేసి సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఇక గతేడాది మే 9న ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. సారి 15 రోజుల ముందే ఫలితాలను వెల్లడించాలని బోర్డు నిర్ణయించింది. ఫలితాల కోసం tsbie.cgg.gov.in, results.cgg.gov.in వెబ్సైట్లలో సంప్రదించాలని ఇంటర్ బోర్డు సూచించింది. ఫలితాల ప్రకటన అనంతరం విద్యార్థుల సౌలభ్యం కోసం మార్కుల జాబితాను వివిధ మార్గాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు వివరించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

