TS ICET 2023 | ఐసెట్ ఫలితాల్లో 86.17 శాతం ఉత్తీర్ణత.. వచ్చే నెలలోనే కౌన్సెలింగ్!
TS ICET 2023 | హనుమకొండ చౌరస్తా, జూన్ 29: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు
TS ICET 2023 | హనుమకొండ చౌరస్తా, జూన్ 29: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. కాకతీయ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, టీఎస్- ఐసెట్ ఛైర్మన్, కేయూ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ తాటికొండ రమేశ్, కన్వీనర్ ప్రొఫెసర్ వరలక్ష్మీ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు సమక్షంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ.. మొత్తం 75,925 మంది అభ్యర్థులు ఐసెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. 70,900 మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 61,092 మంది(86.17 శాతం) అర్హత సాధించినట్లు చెప్పారు. అర్హత సాధించిన వారిలో పురుషులు 29,618 మహిళలు 31,473 మంది, ట్రాన్స్‌జెండర్-1 ఒకరు ఉన్నట్లు తెలిపారు. వచ్చే నెలలో ఐసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు convenor.icet@tsche.ac.in సంప్రదించవచ్చని సూచించారు.
మొదటి 10 ర్యాంకులు సాధించింది వీరే..
| ర్యాంక్ | పేరు | ప్రాంతం |
| మొదటి ర్యాంకు | నూకల శరణ్‌కుమార్ | హుజూర్నగర్ ( సూర్యాపేట ) |
| 2వ ర్యాంకు | నాగులపల్లి సాయినవీన్ | కంచన్‌బాగ్ (హైదరాబాద్) |
| 3వ ర్యాంకు | రవితేజ సజ్జ | మేడ్చల్ మల్కాజ్గిరి |
| 4వ ర్యాంకు | ఎస్.సాయిఫణి ధనుష్ | నేరేడ్మెట్ (మేడ్చల్ మల్కాజ్గిరి) |
| 5వ ర్యాంకు | మల్లికంటి గోపి | నేరేడుచర్ల ( సూర్యాపేట ) |
| 6వ ర్యాంకు | తిరుగుడు సుమంత్‌కుమార్‌రెడ్డి | అల్కపురి ( సూర్యాపేట) |
| 7వ ర్యాంకు | ఆయాచితుల నితీష్‌కుమార్ | వేములవాడ (రాజన్న సిరిసిల్ల) |
| 8వ ర్యాంకు | వేదాంతం సాయివెంకట కార్తిక్ | బొల్లారం (మేడ్చల్ మల్కాజ్గిరి ) |
| 9వ ర్యాంకు | నాగసాయి కృష్ణవంశీ | దుగ్గిరాల(గుంటూరు) |
| 10వ ర్యాంకు | బైరి సాయిగణేష్ | గోదావరిఖని (మంచిర్యాల) |
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

