యూనివర్సిటీలు విశిష్ట నిలయాలుగా ఎదగాలి : గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : తెలంగాణలోని యూనివర్సిటీలు విశిష్ట నిలయాలుగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణలోని వర్సిటీల ఉపకులపతులతో ఛాన్సలర్ హోదాలో గవర్నర్ తమిళిసై బుధవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. గవర్నర్ ఆన్లైన్ సమీక్షకు 14 విశ్వవిద్యాలయాల వీసీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. వర్సిటీలు పరిశోధన, ఆవిష్కరణల కేంద్రాలుగా ఎదగాలన్నారు.
కరోనా సంక్షోభంపై శాస్త్ర, సామాజిక పరిశోధనలు జరగాలన్నారు. విద్యార్థులకు టీకాల అంశంలో విశ్వవిద్యాలయాలు చొరవ చూపాలన్నారు. తరగతులు, పరీక్షలు సకాలంలో నిర్వహించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలన్నారు. ఆన్లైన్ విద్యను అందుకోలేని పేదలకు సదుపాయాలు కల్పించాలన్నారు. డిజిటల్ విద్య అంతరాలను తగ్గించాలి గానీ పెంచకూడదని గవర్నర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్స్లర్ లతో వర్చువల్ గా సమావేశమై యూనివర్సిటీలను ఉత్కృష్టత నిలయాలుగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలని సూచించాను. ఆన్ లైన్ తరగతులు, సకాలంలో పరీక్షలు, పరిశోధనలు, పూర్వ విద్యార్థుల సమన్వయం చర్చించడం సంతోషంగా ఉంది. pic.twitter.com/hJfScOH83Z
— Dr Tamilisai Soundararajan (@DrTamilisai4BJP) June 9, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

