ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. మొక్కలు నాటిన గవర్నర్ తమిళిసై

హైదరాబాద్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ శనివారం రాజ్ భవన్ ఆవరణలో మొక్కలను నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ శ్రీకారకర్త, ఎంపీ జె. సంతోష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గవర్నర్‌తో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. మన రాష్ట్రం, దేశాన్ని పచ్చదనం చేయడంలో అన్ని వర్గాల ప్రజలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
పర్యావరణ వ్యవస్థను రక్షించడం, పునరుద్ధరించడం, ప్రోత్సహించడం భూమాత ఆరోగ్యానికి చాలా అవసరం అన్నారు. భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం మనం ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను అందివ్వాలన్నారు. దీనికోసం స్థిరమైన అభివృద్ధి నమూనాలను అనుసరించాలని ఆమె తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి ప్రస్తావిస్తూ గ్రీన్ కవర్ మెరుగుపరచడానికి ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని గవర్నర్ ప్రశంసించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు వివిధ వర్గాల ప్రజలను కలుపుకొని 10 కోట్లకు పైగా మొక్కలు నాటడం గొప్ప విషయమని కొనియాడారు.
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా తన ప్రయత్నాలను వివరిస్తూ ఎంపీ సంతోష్ కుమార్ “వృక్ష వేదం” పుస్తకాన్ని గవర్నర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రఖ్యాత నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.సౌందరరాజన్, గవర్నర్ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, జాయింట్ సెక్రటరీలు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rythu Garjana Sabha | బీఆర్ఎస్ రైతు గర్జన పోస్టర్ ఆవిష్కరణ.. ఈ నెల 11న నిర్మల్‌లో కేటీఆర్ సభ
డీప్‌ఫేక్ వీడియోలతో ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీకి బెదిరింపులు.. రూ.5 కోట్లు డిమాండ్ చేసిన ముఠా!
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

