399 జెన్కో పోస్టులకు నోటిఫికేషన్
జెన్కోలో 399 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కాగా, మరో 60 కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేస్తారు.
- అసిస్టెంట్ ఇంజినీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి చర్యలు
- రేపటి నుంచి 29 వరకు దరఖాస్తుల ప్రక్రియ
హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): జెన్కోలో 399 పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఇందులో 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు కాగా, మరో 60 కెమిస్ట్ పోస్టులు ఉన్నాయి. లిమిటెడ్ రిక్రూట్మెంట్, జనరల్ రిక్రూట్మెంట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేస్తారు. రెండు విభాగాలకు ఈ నెల 7 నుంచి 29 వరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తారు. డిసెంబర్ 3న పరీక్ష నిర్వహిస్తారు. అసిస్టెంట్ ఇంజినీర్లలో ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు డిగ్రీ (బీటెక్) లేదా తత్సమాన అర్హత కలిగిన వారు అర్హులుగా పరిగణించారు. జనరల్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. కెమిస్ట్ పోస్టులకు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ లేదా ఎమ్మెస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్రంలోని ప్రస్తుత విద్యుత్తు కేంద్రాలతోపాటు కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాల అవసరాల నిమిత్తం ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్టు జెన్కో తెలిపింది. ఎంపికైన ఉద్యోగులు తప్పనిసరిగా విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

