Teachers Transfers | పదోన్నతులు లేకుండా బదిలీలు.. షెడ్యూల్‌ను విడుదల చేసిన విద్యాశాఖ
Teachers Transfers | తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం రిలీజ్ చేసింది.
Teachers Transfers | తెలంగాణలో రెండు మల్టీజోన్లలో పదోన్నతులు పక్కనపెట్టి.. కేవలం బదిలీలు మాత్రమే పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం బదిలీలకు సంబంధించిన షెడ్యూల్‌ను సైతం రిలీజ్ చేసింది. రంగారెడ్డి జిల్లాల్లో సీనియార్టీపై, పదోన్నతులకు టెట్ అర్హత కేసులు, పదోన్నతులపై స్టేలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకున్నది.
మల్టీజోన్ 1, 2 పరిధిలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), మల్టీజోన్ -2 పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలల్లోని స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT) టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగళ, బుధవారాల్లో అప్పీళ్లు, ర్యాంకుల దిద్దుబాటు, ఖాళీల సవరణల అప్డేట్కు అధికారులు అవకాశం కల్పించగా.. ఈ నెల 5న తుది సీనియారిటీ జాబితా ప్రకటించనున్నారు.
ఈ నెల 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చారు. 8న వెబ్ ఆప్షన్ల సైతం ఎడిట్ చేసుకునే వీలు కల్పించింది. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

