DSC | డీఎస్సీ పరీక్షల తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే డీఎస్సీ కోసం ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అయితే, గడువును జూన్ 20 వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీ పరీక్షలను ఆన్లైన్ విధానంలో జులై 17 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ పేర్కొంది. మరో వైపు విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేసింది. ఈ మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ నిర్వహించనున్నది. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో టెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 10 వరకు దరఖాస్తునకు గడువు ఇచ్చింది.