TS EAPCET | టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫలితాలు విడుదల
TS EAPCET | టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు.
TS EAPCET | హైదరాబాద్ : టీఎస్ ఎప్‌సెట్ -2024 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి కలిసి విడుదల చేశారు.
అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 89.66 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలో 90.18 శాతం, అబ్బాయిలు 88.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో 74.98 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇందులో అమ్మాయిలు 75.85 శాతం, అబ్బాయిలు 74.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.
అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలకు 91,633 మంది విద్యార్థులు హాజరు కాగా, 82,163 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,40,618 మంది విద్యార్థులు హాజరు కాగా, 1,80,424 మంది ఉత్తీర్ణత సాధించారు.
టీఎస్ ఎప్‌సెట్ పరీక్షలు మే 7, 8వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం వారికి, 9, 10, 11 తేదీల్లో ఇంజినీరింగ్ వారికి పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే.
టీఎస్ ఎప్‌సెట్ ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

