TS EAMCET | హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్( TS EAMCET ) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. మే 7వ తేదీ నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల( Engineering Exams ) తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మే 12, 13, 14 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 10, 11 తేదీల్లో నిర్వహించాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష( Agriculture Exam ) యథాతథంగా జరగనుంది. నీట్( NEET ), టీఎస్పీఎస్సీ( TSPSC ) పరీక్షల కారణంగా ఎంసెట్ ఇంజినీరింగ్ షెడ్యూల్లో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.