Manthani | కనకవర్షం కురుస్తుందని.. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినితో నగ్న పూజలకు యత్నం
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటున్నది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే వంట మనిషి ఆ ఇద్దరు విద్యార్థులను చేరదీసినట్టుగా నటిస్తూ..
Manthani | పెద్దపల్లి, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)/మంథని రూరల్ : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బాలికల వసతి గృహంలో సోమవారం రాత్రి బాలికతో నగ్నపూజలకు యత్నించిన ఘటన కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన ఒక విద్యార్థిని, తన సోదరితో కలిసి మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటున్నది. వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న హాస్టల్లో పనిచేసే వంట మనిషి ఆ ఇద్దరు విద్యార్థులను చేరదీసినట్టుగా నటిస్తూ.. పెద్దమ్మాయికి మాయ మాటలు చెప్పింది. నగ్న పూజలు చేస్తే కనకవర్షం కురుస్తుంది. ఆ డబ్బుతో మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చు’ అని చెప్పింది. వారం క్రితం వంట మనిషి పర్సనల్ రూంకు ఓ వ్యక్తిని తీసుకువచ్చి బాలికను పిలిపించి అతని ముందర నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజ లు చేస్తారని చెప్పింది.
దీంతో ఆ విద్యార్థిని భయంతో హాస్టల్ నుంచి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లి నాలుగు రోజులుగా తలదాచుకున్నది. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులు హాస్టల్ వద్దకు వచ్చి సదరు వంట మనిషిని నిలదీశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా సీఐ రాజు, ఎస్ఐ రమేశ్ చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రలోభ పెట్టిన మహిళను అదుపులోకి తీసుకొని, పోలీసు స్టేషన్కు తరలించారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు మంథని ఎస్ఐ తెలిపారు. పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోనున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

