హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు వచ్చేవారం ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా నామకరణం చేయనున్నారు. జూలై 4న అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా ఈనెల 23న రేవంత్రెడ్డి ఐటీ కారిడార్లోని ఈ రోడ్డును అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అమెరికా రాయబారి సెర్జి యో గోర్ కూడా హాజరవుతారని తెలిసింది.