పార్టీ జెండా పండుగను ఘనంగా నిర్వహిద్దాం : కేటీఆర్
TRS party | సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు,

హైదరాబాద్ : సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహిద్దాం అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గ్రామాలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ర్ట కార్యవర్గం, పార్టీ సర్పంచులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్ధగత నిర్మాణంపైన కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
సమన్వయంతో ముందుకెళ్లాలి..
సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. అదే రోజు డీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దీంతో పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు ఆ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ క్రమంలో స్థానిక నాయకత్వం పార్టీ జెండా పండుగ విజయవంతానికి కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలు, సీనియర్ నాయకులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఈ జెండా పండగ తర్వాత కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కేటీఆర్ సూచించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల, పట్టణ కమిటీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 2 వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక, జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని కేటీఆర్ తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు. జిల్లా అద్యక్షులు, నూతన జిల్లా కార్యవర్గాలను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమన్వయం చేసుకుని ప్రకటిస్తారన్నారు.
పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్నవారికే కమిటీలో చోటు
పార్టీ కమిటీల కూర్పు విషయంలో కేటీఆర్ పలు సూచనులు చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేకుంటే అయా కమీటీలు చెల్లవన్నారు. పార్టీ అనుబంధ కమీటీలతో పాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు సూచనలు చేశారు. ముందుగా మండల కమిటీలు పూర్తి చేసిన తర్వతా గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమీటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన చోటు కల్పించాలని కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం
హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా, ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నగర సమావేశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో బస్తీ కమిటీ, డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంఛార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం ఈ విషయంలో సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం ఉంటుందని కేటీఆర్ వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- Jenda Panduga
- KTR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

