సీఎం కేసీఆర్‌ను కించపరిచినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: టీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి
తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై. సతీశ్‌రెడ్డి పోలీసులను కోరారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణనిరాహార దీక్ష చేసి, కేంద్రం మెడలువంచి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌పై అనుచిత, అసభ్యకర, అభ్యంతకరమైన స్కిట్స్ వేయడాన్ని టీఆర్ఎస్ సోషల్‌మీడియా తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ తెచ్చిన నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన బీజేపీ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ సోషల్‌మీడియా కన్వీనర్ వై. సతీశ్‌రెడ్డి పోలీసులను కోరారు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణనిరాహార దీక్ష చేసి, కేంద్రం మెడలువంచి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్‌పై అనుచిత, అసభ్యకర, అభ్యంతకరమైన స్కిట్స్ వేయడాన్ని టీఆర్ఎస్ సోషల్‌మీడియా తరఫున ఖండిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ను కించపర్చేలా స్కిట్ వేసిన, వారిని ఉసిగొల్పిన బీజేపీ నాయకులు బండి సంజయ్, ప్రేమేందర్‌రెడ్డి, జిట్టా బాలకిషన్‌రెడ్డి, రాణిరుద్రమపై హైదరాబాద్ వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డికి శుక్రవారం ఆయన ఫిర్యాదు చేశారు.
ఈ సందర్బంగా వై. సతీశ్‌రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదు..ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడని, అభ్యంతరకర స్కిట్స్‌తో ఆయన ప్రతిష్టను దిగజార్చారని మండిపడ్డారు. ఈ స్కిట్ వేయించిన వాళ్లు కనీసం ఆయన కాలి గోటికి కూడా సరిపోరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. బీజేపీ నాయకుల్లాగే తామూ ప్రధానిపై విమర్శలు చేయగలమని, కానీ, ఆ స్థాయికి దిగజారదల్చుకోలేదని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకులు ఇలాగే చిల్లరగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోబోరని హెచ్చరించారు. బీజేపీ నాయకులు వేయించిన స్కిట్లో తెలంగాణ పథకాలను కూడా కించపర్చారని తెలిపారు. తెలంగాణ పథకాలను ప్రధానితోసహా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ఎమ్మెల్యేలు మెచ్చుకున్న విషయాన్ని కూడా మరిచిపోయారన్నారు.
పింఛన్ల కోసం మహిళలు తమ భర్తలను చంపుకుంటున్నట్లు స్కిట్లో చూపించారని, ఇదిచూసి బండి సంజయ్, ప్రేమేందర్‌రెడ్డి నవ్వుతున్నారని సతీశ్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలను కించపరుస్తుంటే చూసి పళ్లు ఇకిలించే మీరు ఎలా నాయకులయ్యారంటూ దుయ్యబట్టారు. మరీ ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా ? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు చివరిసారిగా హెచ్చరిస్తున్నామని, ఇకనుంచైనా ఇలాంటివి మానుకోకపోతే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని కించపర్చేలా ఎవరు మాట్లాడినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడ కిట్స్‌లో ప్రాంగణ ఎంపికలు.. 44 మందికి ఉద్యోగాలు
సంస్కరణల పేరిట విద్యార్థుల భవిష్యత్‌తో ప్రయోగాలా?
సారపాకలో పోలీస్ ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని ఎస్పీకి వినతి
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

