సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపిన టీఆర్ఎస్ జిల్లాల కొత్త అధ్యక్షులు.. ఫోటోలు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాలకు టీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షులను ఇటీవల నియమించిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా పలు జిల్లాలకు చెందిన కొత్త అధ్యక్షులు గురువారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాల కొత్త అధ్యక్షులతో పాలు పలువురు నాయకులు పాల్గొన్నారు.

మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా.. ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, వొడితెల సతీష్ కుమార్, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ ఓంటేరు ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కె.విద్యాసాగర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా.. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, ఎల్.రమణ, కౌషిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ బండా శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఉన్నారు.

హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, భేతి సుభాష్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మన్ సలీం తదితరులు ఉన్నారు.

ములుగు జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్, జనగామ జిల్లా అధ్యక్షుడు పి.సంపత్ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి.. సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, శంకర్ నాయక్ తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు సి.లక్ష్మారెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్ రెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణమోహన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు జయపాల్ యాదవ్, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి , స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

కొమ్రంభీం అసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ దండే విఠల్ సీఎంను కలిశారు.









Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

