హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ : ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హిజాబ్ వివాదంపై స్పందించారు. మహిళల వస్త్రధారణ విషయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. స్త్రీలు సృష్టికర్తలు .. వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందన్నారు. ఈ సందర్బంగా తాను చేతితో రాసిన కవితను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
నుదుటున సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పుడు.. హిజాబ్ ధరించడం ముస్కాన్ వ్యక్తిగత స్వేచ్చ అవుతుందన్నారు. ఎలా ఉండాలి ? ఏం ధరించాలి? ఏం చేయాలి? అన్న విషయాలను మహిళల ఇష్టాఇష్టాలకే వదిలేయాలని కవిత సూచించారు.
ఎమ్మెల్సీ కవిత రాసిన ‘కవిత’
హిందూ-ముస్లిం-సిక్కు-క్రిస్టియన్..
మతమేదైనా సరే…
మనమంతా భారతీయులమే..
సిందూర్-టర్బన్-హిజాబ్-క్రాస్
ఏది ధరించినా మన గుర్తింపు భారతీయతే…
‘త్రివర్ణ పతాకాన్ని’ రూపొందించిన పింగళి వెంకయ్య అయినా..
‘జై హింద్’ అని నినదించిన అబిద్ హసన్ సఫ్రానీ అయినా..
‘సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్’ అని ఎలుగెత్తి చాటిన ముహమ్మద్ ఇక్బాల్ అయినా..
‘జన గణ మన’తో జాతిని ఏకం చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా..
మనకు చెప్పింది ఒక్కటే..
మనం ఎవరైనా… మనమంతా భారతీయులమనే.. !!
Wearing and applying Sindoor is my conscious choice
Wearing Hijab is Muskan’s choice.Let women decide what they are comfortable in embracing and wearing.#DontTeachUs pic.twitter.com/wDuYVW6X5O
— Kavitha Kalvakuntla (@RaoKavitha) February 10, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రెండో టెస్టులో సఫారీల ఘన విజయం
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

