బీఎల్ సంతోష్‌కు సిట్ నోటీసు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్)కు సిట్ నోటీసు జారీ చేసిందని అందులో ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు
- హైకోర్టులో దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లో వెల్లడించిన బీజేపీ
- 21న హాజరు కావాల్సిందిగా కోరింది
- సిట్ నోటీసులపై స్టే ఇవ్వాలి: పిటిషనర్
- ప్రేమేందర్‌రెడ్డి మధ్యంతర పిటిషన్‌తో బయటపడ్డ సిట్ నోటీసు వ్యవహారం
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి శుక్రవారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ (ఇంటర్‌లొక్యూటరీ అప్లికేషన్-ఐఏ) దాఖలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీ లక్ష్మీజనార్దన సంతోష్ (బీఎల్ సంతోష్)కు సిట్ నోటీసు జారీ చేసిందని అందులో ప్రేమేందర్‌రెడ్డి వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన అడ్వొకేట్ శ్రీనివాస్‌కు కూడా సిట్ నోటీస్ ఇచ్చినట్టు ప్రేమేందర్‌రెడ్డి తన ఇంటరిమ్ పిటిషన్లో తెలిపారు. బీఎల్ సంతోష్‌కు, అడ్వొకేట్ శ్రీనివాస్‌కు సిట్ ఇచ్చిన నోటీస్ ప్రతులను పిటిషనర్ తన పిటిషన్‌కు జోడించారు. బీజేపీ నేత ప్రేమేందర్‌రెడ్డి సమర్పించిన ఈ మధ్యంతర పిటిషన్‌తో బీఎల్ సంతోష్‌కు నోటీసులు జారీ అయిన విషయం బయటపడింది. ఈ నెల 21వ తేదీ ఉదయం పదిన్నర గంటలకు బంజారాహిల్స్‌లోని తమ కార్యాలయంలో హాజరుకావాల్సిందిగా బీఎల్ సంతోష్‌ను సిట్ తన నోటీసులో కోరినట్టు బీజేపీ నేత తన మధ్యంతర పిటిషన్లో పేర్కొన్నారు.
దర్యాప్తునకు హాజరుకాకపోతే అరెస్ట్ చేస్తామని కూడా నోటీసులో ప్రస్తావించారని అందులో వెల్లడించారు. సిట్ నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ప్రేమేందర్‌రెడ్డి కోరారు. ‘సాక్ష్యాధారాలను తారుమారు చేయకూడదు. దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలి. ఎప్పుడు పిలిచినా దర్యాప్తునకు హాజరుకావాలి. కేసుకు సంబంధించిన పూర్తి పత్రాలు అందజేయాలి. ఇతర నిందితులు ఉంటే, వాళ్లను పట్టుకునేందుకు సహకరించాలి. ఏ ఆధారాలను ధ్వంసం చేయకూడదు. అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు. వ్యక్తిగత మొబైల్ ఫోన్లోని ఏ సమాచారాన్నీ మార్పులు చేయకూడదు. ఇతర మొబైల్, ల్యాప్‌టాప్‌లు ఉంటే, వాటిని దర్యాప్తునకు తీసుకురావాలి. దర్యాప్తు సమయంలో దర్యాప్తు అధికారి ఇతర ఆంక్షలు విధించొచ్చు. దర్యాప్తునకు హాజరుకాకపోతే 41ఏ(3), (4) సెక్షన్ల కింద అరెస్టు చేసేందుకు వీలున్నది’ అని బీజేపీ ఐఏకు జోడించిన సిట్ నోటీసు పత్రాల్లో ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

