బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 01:51:00

తేనెటీగల దాడిలో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

తేనెటీగల దాడిలో టీఆర్‌ఎస్‌ నాయకుడి మృతి

ఊట్కూర్‌: తేనెటీగల దాడిలో నారాయణపేట జిల్లా ఊట్కూర్‌ మండలం పెద్దజట్రంకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు నాయిని జయసింహారెడ్డి(62) మృతి చెందారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తన పొలంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు వెళ్లాడు. ఆలయ ఆవరణలో నైవేద్యం సిద్ధం చేసేందుకు పొయ్యి వెలిగించగా పక్కనే చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా వారిపై దాడి చేశాయి. దీంతో జయసింహారెడ్డితోపాటు ఆయన సోదరుడు రాఘవరెడ్డి, పూజారి జంగం శేఖర్‌ మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. నారాయణపేట దవాఖానకు తరలిస్తుండగా జయసింహారెడ్డి మార్గమధ్యంలోనే మృతి చెందాడు. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు.