నేడు టీఆర్ఎస్ జనరల్ బాడీ
తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు.
- పార్టీ అధినేత ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ
- సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెప్పేందుకు తరలివస్తున్న
- ఇతర రాష్ర్టాల రాజకీయ నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో బుధవారం ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశ ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి, కార్యాలయ ఇన్చార్జి నాయినేని రాజేశ్వర్‌రావు పరిశీలించారు. మునుగోడు ఎన్నికలు, జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారన్న నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొన్నది. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక భూమిక పోషించే విషయంలో పార్టీ పేరు మార్పుపై సర్వసభ్య సమావేశంలో విధాన నిర్ణయం తీసుకుంటారని, అనంతరం ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతున్నది. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సమావేశంపై పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ఆసక్తినెలకొన్నది. హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు తమ అధినేత చేసే ప్రకటన అనంతరం సంబురాలు చేసుకొనేందుకు సమాయత్తం అవుతున్నారు.
హైదరాబాద్ చేరుకున్న కుమారస్వామి
జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారనే విస్తృత ప్రచా రం దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయనను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు పలు రాష్ర్టాల ప్రతినిధులు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. నగరానికి వచ్చిన జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆ రాష్ట్ర మాజీ మం త్రి రేవణ్ణ, పలువురు జేడీఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు బేగంపేట విమానాశ్రయంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు. తమిళనాడుకు చెందిన విదుతాలై చిరుత్తైగళ్ కట్చె పార్టీ అధ్యక్షుడు, చిదంబరం పార్లమెంట్ సభ్యుడు, ప్రముఖ దళితనేత తిరుమల్వలవన్ కూడా నగరానికి చేరుకున్నారు. మహారాష్ట్ర, పం జాబ్ వంటి రాష్ర్టాల నుంచి సైతం నాయకులు వస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బుధవారం జరిగే సమావేశంలో వీరంతా పాల్గొనే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singareni Profits | సింగరేణి లాభాలు ఢమాల్.. ఏడాదిలోనే రూ.4,640 కోట్లు డౌన్
Mamata Banerjee | మమతపై హత్యాయత్నం?.. చీరలో కత్తితో ఇంటటికొచ్చిన యువతి!
Singareni Scam | సింగరేణిలో.. స్కాం గ్రెస్.. రూ.1,600 కోట్ల బొగ్గు ఏమైంది?
RIMS Fire Accident | ఐదుగురు పసికందుల మృతికి ఎలుకలే కారణమట.. ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై 50 పేజీల నివేదిక
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

