Bandi Sanjay | హిందీ రాని బండి.. హిందీ పేపర్ లీక్ చేస్తావా?.. టెన్త్ హిందీ పేపర్ లీక్‌పై పేలిన సెటైర్లు
Bandi Sanjay | టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్‌లో బీజేపీ పార్టీ అనుచరులు ఉండటం, టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ లో బండి సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చడం తో ట్విట్టర్లో నెటిజన్లు బీజేపీ లీక్స్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టుల వర్షం కురిపించారు. దీంతో బుధవారం ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో హ్యాష్టా గ్ బీజేపీ లీక్స్ (#BJPLeaks) రెండోస్థానంలో నిలిచింది.
Bandi Sanjay | హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీలో ఏ1 నిందితుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ‘లీకు వీరుడు’ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పటికే గ్రూప్-1 పేపర్ లీకేజీ వ్యవహారంలో బీజేపీ హస్తం ఉందనే ఆరోపణలు కొనసాగుతుండగానే, తాజాగా టెన్త్ పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకోవడం.. వాటన్నింటి వెనుక బీజేపీ అనుచరులు, ఆ పార్టీ అనుచరులతో దగ్గరి సంబంధాలు ఉండటం, పార్టీ అధ్యక్షుడు బండికి సన్నిహిత సంబంధాలు ఉండటంపై ఇప్పటికే అనేక అనుమానాలు నెలకొన్నాయి.
గ్రూప్ 1 లీక్‌పై సిట్ విచారణ కొనసాగుతుండగానే మరోవైపు టెన్త్ హిందీ పేపర్ లీక్ కావడం, అందులో ఏ1గా కాషాయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే ఉండటం ఆరోపణలకు బలం చేకూర్చింది. దీంతో బీజేపీ, ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. నాగార్జున నటించిన గ్రీకువీరుడు సినిమా పోస్టర్ ఒకవైపు, లీకు వీరుడు అంటూ బండి ఫొటో మరోవైపు ఉంచి చురకలంటించారు. ‘హిందీరాని బండి.. హిందీ పేపర్ లీక్చేసుడు అవసరమా?’ అంటూ మరో నెటిజన్ వ్యంగ్యంగా విమర్శించారు. ‘ఛీ.. అన్న ఎప్పుడూ హిందీ దగ్గరే దొరికిపోతాడు!’ అంటూ ఒకరు చమత్కరించారు. ఓ నెటిజన్ మరో అడుగు ముందుకేసి ‘మన దేశంలో హిందువు అయి ఉండి హిందీ మాట్లాడటం రాని నేను హిందీ పేపర్ లీక్ చేయడం తప్పా? హిందూ దేశంలో విద్యార్థుల కోసమే కదా నేను ఈ పని చేసింది’ అంటూ బండి సంజయ్ అంటున్నట్టుగా పోస్ట్ పెట్టాడు. ‘బీజేపీలో అందరూ ఫేక్ సర్టిఫికెట్గాళ్లే.. చదువు విలువ తెలిసినోడు ఉంటేగదా?’ అని మరొకరు ట్వీట్ చేశారు. పార్టీ, రాజకీయ స్వప్రయోజనాల కోసం అభం శుభం తెలియని విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతారా? అంటూ పలువురు నెటిజన్లు మండిపడ్డారు.
ట్విట్టర్ ట్రెండింగ్‌లో ‘#బీజేపీలీక్స్’!
అటు టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్‌లో బీజేపీ పార్టీ అనుచరులు ఉండటం, టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ లో బండి సంజయ్‌ను ఏ1 నిందితుడిగా చేర్చడం తో ట్విట్టర్లో నెటిజన్లు బీజేపీ లీక్స్ హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టుల వర్షం కురిపించారు. దీంతో బుధవారం ఇండియాలో టాప్ ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో హ్యాష్టా గ్ బీజేపీ లీక్స్ (#BJPLeaks) రెండోస్థానంలో నిలిచింది. ‘మోదీజీ.. ఇదేంది?’ అనే హ్యాష్‌ట్యాగ్ లతో కొందరు పెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. ‘పేపర్ లీకేజీ వెనుక బీజేపీ ఉందని రుజువైతే ప్రజలు మనల్ని ఎప్పటికీ క్షమించరు’ అని రాకేశ్ అనే ఏబీవీపీ కార్యకర్త ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయ్యింది. అలాగే, ‘బండి సంజయ్ నీ ఫోన్ ఎక్కడ?’ అంటూ పలువురు పెట్టిన పోస్టులు ఆన్లైన్లో చక్కర్లుకొడుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

