నేడు దివ్యాంగ అభ్యర్థుల రిజల్ట్
ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి (సోమవారం)సాయంత్రం ప్రకటిస్తామని వెల్లడించింది.
- ఎట్టకేలకు తేదీ ప్రకటించిన ట్రిబ్
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
- హర్షం వ్యక్తంచేసిన పీడబ్ల్యూడీ అభ్యర్థులు
హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) స్పందించింది. గురుకుల ఉపాధ్యాయ నియామకాల్లో ఉత్తీర్ణత సాధించిన దివ్యాంగ అభ్యర్థుల మెరిట్ జాబితాను నేటి (సోమవారం)సాయంత్రం ప్రకటిస్తామని వెల్లడించింది. ట్రిబ్ చైర్మన్ అయేషా మస్రత్‌ఖానం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గురుకుల పోస్టులు అన్ని క్యాటగిరీలకు సంబంధించి తుది జాబితాను ట్రిబ్ ఇప్పటికే విడుదల చేయగా, దివ్యాంగుల అభ్యర్థుల తుది జాబితాను నాలుగు నెలలుగా పెండింగ్‌లోనే పెట్టింది.
మరోవైపు ఇప్పటికే అలాటయిన అభ్యర్థులకు పోస్టింగ్స్‌ను ఇచ్చే ప్రక్రియను ఆయా సొసైటీలు ముమ్మరం చేశాయి. దీంతో దివ్యాంగ అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఈవిషయమై ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. దివ్యాంగుల అభ్యర్థుల ఆవేదనను ప్రస్తావించింది. ఎట్టకేలకు ట్రిబ్ స్పందించింది. దివ్యాంగ అభ్యర్థుల ఎంపిక జాబితాను నేటి సాయంత్రంలోగా వెల్లడిస్తామని స్పష్టం చేసింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, పోస్టింగ్ ఉత్తర్వులను కూడా సంబంధిత సొసైటీలు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అందిస్తామని వెల్లడించింది. దీనిపై దివ్యాంగ అభ్యర్థులు హర్షం వ్యక్తంచేశారు. ట్రిబ్ చైర్మన్, ఇతర అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
హాస్టల్ వెల్ఫేర్ అభ్యర్థులు ఆందోళన చెందొద్దు..
గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియను నేటి నుంచి (సోమవారం) చేపడుతున్నట్టు బీసీ, ఎస్సీ సొసైటీలు షెడ్యూల్‌ను ప్రకటించాయి. సబ్జెక్టులవారీగా అభ్యర్థులకు తేదీలు నిర్ణయించి సమాచారం అందించాయి. అయితే నేటి నుంచే హాస్టల్ వెల్ఫేర్ పోస్టులకు టీజీపీఎస్సీ రాత పరీక్షను నిర్వహిస్తున్నది. దీంతో ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న గురుకుల అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. పరీక్ష రాసేది ఎలా..? అనే సందిగ్ధంలో పడ్డారు. ఈ విషయంపై ‘అభ్యర్థుల్లో టెన్షన్’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై ట్రిబ్ స్పందించింది. టీజీపీఎస్సీ నిర్వహించే పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని స్పష్టం చేసింది. సొసైటీలు షెడ్యూలు చేసిన మరుసటి రోజు సర్టిఫికెట్ల ధ్రువీకరణకు హాజరుకావచ్చని వెల్లడించింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

