ఊర్లకు ఊర్లు ఖాళీ!
బీఆర్ఎస్ పాలనా కాలంలో వలసలు వీడి సొంతూర్లకు చేరుకున్న తండాల వా సులు.. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఊళ్లు వదిలిపోతున్నారు.
- ఉపాధి కోసం గిరిజన రైతుల వలసబాట
- సాగునీరు, కరెంటు లేక ఎండుతున్న పంటలు
- కుల్కచర్ల మండలం తండాల్లో ఇండ్లకు తాళాలు
వికారాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పాలనా కాలంలో వలసలు వీడి సొంతూర్లకు చేరుకున్న తండాల వా సులు.. మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఊళ్లు వదిలిపోతున్నారు. గతంలో జిల్లాలోని పరిగి, కొడంగల్ నియోజకవర్గాల ప్రజలు ఉపాధి కోసం దుబాయ్, ముంబై, పుణె, హైదరాబాద్‌కు వెళ్లేవారు. వలస వెళ్లిన ప్రజలు బీఆర్ఎస్ అమలుచేసిన రైతు సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఉపాధి కల్పనతో తిరిగి సొంతూళ్లకు చేరుకున్నారు.
కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదికే మళ్లీ వలసలు మొదలయ్యా యి. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ అమలు చేయలేదు. సాగునీరు లేక, కరెంటు కోతలతో వ్యవసాయం చేయడం దుర్భరంగా మారింది. లాగోడికి చేసిన అప్పు లు కూడా తీర్చలేని పరిస్థితుల్లో ఇంటిల్లిపాది వలసబాట పట్టారు. చాలామంది ముంబై, పుణె, హైదరాబాద్‌కు ముల్లెమూటా సర్దుకొని బయలుదేరుతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి సాగునీరు తీసుకువచ్చి వలసలను శాశ్వతంగా దూరం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లింది.
కానీ రేవంత్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి రైతులతోపాటు సబ్బండ వర్గాలకు అన్యాయం చేసింది. మరోవైపు ఫార్మా కంపెనీల కోసం రైతుల వద్దనున్న ఎకరా, రెండెకరాలను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధపడింది. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యుత్తు కోతలతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి.
అప్పులు చేసి వరి పంటలను సాగు చేస్తే ఓ వైపు ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, విద్యుత్తు కోతలతో పంటలపై ఆశలు వదులుకొని ఇండ్లు వదిలిపోతున్నారు. ముఖ్యంగా పరిగి నియోజకవర్గంలోని తండాలకు చెందిన వందల కుటుంబాలు ఊర్లను వదిలి ముంబై, పుణె, హైదరాబాద్ వెళ్లిపోయారు. కుల్కచర్ల మండలంలోని తండాల్లో ఊర్లకు ఊర్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. దీప్లానాయక్ తండా, బిందెగండనాయక్, చింతల్‌కుంట తండాల్లో ఇండ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. వృద్ధులు పస్తులతో జీవనం గడుపుతున్నారు.
ఉపాధిలేకనే వలసలు వెళుతున్నారు…
మా దీప్లానాయక్తండా నుంచి మొత్తం వలస వెళ్తున్నారు. దాదాపు 40 కుటుంబాలు పుణె వెళ్లారు. వర్షాలు సక్రమంగా లేని కారణంగా గ్రామంలో ఉపాధిలేక వలసలు వెళ్తున్నారు. కుటుంబాలను ఆదుకోకుంటే వలసలు ఇంకా పెరుగుతాయి. ఉన్న ఊర్ల ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– లక్ష్మణ్‌నాయక్, రైతు దీప్లానాయక్తండా, కులకచర్ల మండలం
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
కులకచర్ల మండలంలోని వివిద తండాల్లో ఉపాధిలేక స్థానికులు ఎక్కవగా వలస వెళ్లారు. గ్రామంలో ఉపాధి లభిస్తే ఇక్కడే ఉండేవారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా జీవనోపాధిని పొందేందుకు తండావాసులు తమ కుటుంబాలతో పుణె, ముంబై, హైదరాబాద్ నగరాలకు వలస వెళ్లారు. ప్రభుత్వం వలసల నివారణకు చర్యలు తీసుకోకుంటే తండాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. తండాల ప్రజల కోసం ప్రత్యేకించి నిధులు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ప్రజలు వలసల బాట పట్టారు.
– రాజేందర్‌నాయక్, గిరిజన విద్యార్థి సంఘం, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎత్తుకాల్వతండా, కులకచర్ల మండలం
జీవనోపాధికోసం వలస వచ్చాను
నేను ప్రస్తుతం పుణెలో పనిచేస్తున్నాను. జీవనోపాధి లభించక, వర్షాలు సక్రమంగా లేక వలస వచ్చాను. మాకు ప్రభుత్వం జీవనోపాధి కల్పిస్తే వలస వచ్చే వాడిని కాను. ప్రస్తుత పరిస్థితుల్లో సొంతూరిలో బతకడం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం ఆదుకొనేందుకు చర్యలు తీసుకోవాలి. లేదంటే మా బ్రతుకులు వలస కూలీలుగానే మిగిలిపోతాయి.
– వెంకట్, వలస కూలీ, ఎత్తుకాల్వ తండా, కులకచర్ల మండలం
ఒక్కదాన్నే ఇంటి దగ్గర ఉంటున్న…
మా కుటుంబసభ్యులు జీవనోపాధికోసం పుణెకు వలస వెళ్లారు. నాకు పనిచేయడానికి చేతకాక ఇంటి దగ్గరనే ఉంటూ ఇల్ల్లు చూసుకుంటున్నా. ప్రభుత్వం జీవనోపాధికోసం ఊరిలో అవకాశాలు కల్పించడం లేదు. దీనివలన జీవనోపాధి పొందడానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేసిన పంటలు చేతికి రాక అప్పులు తీర్చేందుకు మా కుటుంబసభ్యులు పుణె వెళ్లారు.
– సాలీబాయి, వృద్ధురాలు, టేకుల తండా, కులకచర్ల మండలం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

