ఎట్టకేలకు ట్రాన్స్ఫార్మర్ బిగించిన్రు
ఎట్టకేలకు విద్యుత్తు అధికారులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దూపతండాలో ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు.. ఓవర్ లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం.. సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుతున్న పంటలు.. భుజాల మీద మోసుకుంటూ ట్రాన్స్ఫార్మర్ను రిపేరు కోసం తరలించడం.. వెరసి ధూప తండా రైతులు పడుతున్న కష్టాలను ‘నమస్తే తెలంగాణ’ లో ఆదివారం కథనం ప్రచురితమైంది.
- దూపతండాకు చేరిన ట్రాన్స్‌కో అధికారులు
- ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు.. 35 ఎకరాలకు ఉపశమనం
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
పర్వతగిరి, అక్టోబర్ 11: ఎట్టకేలకు విద్యుత్తు అధికారులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దూపతండాలో ట్రాన్స్ఫార్మర్ను బిగించారు. విద్యుత్తు సరఫరాలో తరచూ అంతరాయాలు.. ఓవర్ లోడ్‌తో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం.. సాగునీరు అందక ఎండిపోయే దశకు చేరుతున్న పంటలు.. భుజాల మీద మోసుకుంటూ ట్రాన్స్ఫార్మర్ను రిపేరు కోసం తరలించడం.. వెరసి ధూప తండా రైతులు పడుతున్న కష్టాలను ‘నమస్తే తెలంగాణ’ లో ఆదివారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన విద్యుత్తు శాఖ అధికారులు ఆదివారం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దూపతండాకు తరలివచ్చారు.
ఎస్ఈ ఆనందం, డీఈ దానయ్య, ఏడీఈ తిరుపతి, ట్రాన్స్‌కో సిబ్బంది పూర్ణచారి తదితరులు పరిస్థితిని పరిశీలించారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలుగకుండాట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి అమర్చారు. దీంతో సుమారు 35 ఎకరాల వరి సాగు చేస్తున్న రైతులకు ఊరట లభించింది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు, తరచూ ట్రిప్పులు కావడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని ఇక్కడికి వచ్చిన ఉన్నతాధికారులతో రైతులు మొరపెట్టుకున్నారు. నిరంతర విద్యుత్తును అందించి పంటలను కాపాడాలని వేడుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

