వందే భారత్ అనుమతికి రైల్వే బోర్డు చైర్మన్ కాళ్లు పట్టుకొన్నా
వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్ కాళ్లు కూడా పట్టుకొన్నారట.
- రైలు రూపకర్త సుధాంశుమణి
న్యూఢిల్లీ, మార్చి 18: వందేభారత్ రైళ్లను తామే తెచ్చామని బీజేపీ గొప్పగా ప్రచారం చేసుకొంటున్నది. కానీ, దీని రూపకల్పనకు కష్టపడ్డ వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయనే.. సుధాంశుమణి. ఈ రైలు తయారీ అనుమతి కోసం ఆయ న ఏకంగా రైల్వే బోర్డు చైర్మన్ కాళ్లు కూడా పట్టుకొన్నారట. విదేశాల్లో ఈ రైలును తయారు చేయడానికి అవసరమైన ఖర్చులో కేవలం మూడో వంతుతోనే తాను సెమీ హైస్పీడ్ రైలు తయారు చేస్తానన్న ఈ మెకానికల్ ఇంజనీర్ మాటను తొలుత ఎవరూ విశ్వసించలేదు.
ఈ రైలు అనుమతికి తాను పొందిన కష్టాలను ఆయన ఇటీవల ‘దైనిక్ భాస్కర్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మద్రాస్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) మాజీ జనరల్ మేనేజర్ అయిన సుధాంశుమణి తాను ఆ పదవిలో ఉండగా అతి తక్కువ ఖర్చుతో అత్యంత వేగంగా పరుగుదీసే ట్రైన్‌ను దేశీయంగా తయారు చేయాలనుకున్నారు. దీనికి తన బృందంతో కలిసి ‘ట్రైన్ 18’ పేరిట ప్రాజెక్టు తయారు చేసి ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అనుమతుల కోసం రైల్వే బోర్డు చైర్మన్‌ను కలిసారు. ఇలాంటి రైలును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే అయ్యే మొత్తంలో మూడో వంతుకే తాము ఐసీఎఫ్‌లో తయారు చేస్తామని, దయచేసి దానికి అనుమతి ఇవ్వాలని ఆయన చైర్మన్‌ను కోరారు.
‘అప్పటికీ చైర్మన్ రిటైర్మెంట్కు 14 నెలలే ఉన్నది. అందుకే ఆయన రిటైర్మెంట్కు ముందే రైలును సిద్ధం చేస్తామని చెప్పాం. వాస్తవానికి అది అసాధ్యమని తెలుసు. అయితే ఎలాగోలా అనుమతి తీసుకోవడానికి అప్పుడు అబద్ధం ఆడాం. అయితే అంత చేసినా మాకు అనుమతి లభించలేదు. అయితే ‘నో’ అన్న సమాధానం వినడానికి నేను సిద్ధంగా లేను. దీంతో ఆ ఉన్నతాధికారి కాళ్లు పట్టుకొని, అనుమతి ఇచ్చేవరకు కదలనంటూ భీష్మించా’ ఎట్టకేలకు అనుమతి రావడంతో దానిని 18 నెలల్లో తయారు చేశామని సుధాంశుమణి చెప్పారు. తాము తయారు చేసిన ట్రైన్ 18ని వందేభారత్‌గా నామకరణం చేసినట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

