Traffic Alert | హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఈ రూట్లలో వెళ్లారో ఇక అంతే..!
బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు (Bakrid Prayers) చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు.
హైదరాబాద్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు (Bakrid Prayers) చేయనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) విధించారు. ఓల్డ్ సిటీతోపాటు మాసబ్‌ట్యాంక్, మీరాలం దర్గా, లంగర్‌హౌజ్ వద్ద ట్రాఫిక్ మల్లింపులు ఉంటాయన్నారు. ప్రార్థనల కోసం వచ్చేవారిని మాత్రమే ఈ రూట్లలో అనుమతించనున్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు.
బహదూర్ పురా క్రాస్ రోడ్స్, పురానా పూల్, కామతి పూరా, కిషన్ బాగ్ వైపు నుంచి ప్రార్థనకి వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఇందుకోసం జూపార్క్, మసీదు అల్లా హు అక్బర్ ఎదురుగా వాహనాలు పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. అందువల్ల వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. కాగా, బక్రీద్ సందర్భంగా గ్రేటర్ పరిధిలో రిటైల్ బీఫ్ దుకాణాలను సోమ, మంగళవారాల్లో మూసివేయాలని అధికారులు ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

