హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 10 నుంచి ఫ్లైఓవర్లు బంద్
Traffic restrictions | నూతన సంవత్సరం సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల
హైదరాబాద్: నూతన సంవత్సరం సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో శనివారం రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. అయితే బేగంపేట, లంగర్‌హౌస్ పైవంతెనలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, అప్పర్ ట్యాంక్ బండ్‌పై వాహనాలకు అనుమతి నిలిపివేశారు. అదేవిధంగా రాత్రి 10 గంటల తర్వాత నగరంలోకి లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలను నిషేధించారు.
ఇక ఎయిర్‌పోర్టు వైపు వెళ్లే కార్లకు రాత్రి 10 నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విమాన టిక్కెట్లు చూపిస్తే పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీద నుంచి రాకపోకలకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. మద్యం సేవించి బండి నడిపితే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు.
ట్రాఫిక్ మళ్లింపులు ఇలా..
ఖైరతాబాద్ వీవీ విగ్రహం వద్ద నుంచి నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్మార్గ్ వైపునకు వాహనాలకు అనుమతి లేదు. వాహనాలను రాజ్‌భవన్ రోడ్డులోకి మళ్లిస్తారు.
బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్ వైపు మళ్లిస్తారు.
లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్‌కు వచ్చే వాహనాలను అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్ మినార్ వైపు నుంచి రవీంద్రభారతి వైపు మళ్లిస్తారు.
ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలు ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్, లక్డీకాపూల్ వైపు వెళ్లాలి.
మింట్ కంపౌండ్ నుంచి సచివాలయం వెళ్లే లైన్లోకి సాధారణ వాహనదారులకు అనుమతి ఉండదు. ఈ రోడ్డు మూసేస్తారు.
నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి నుంచి సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ వాహనాలను పీవీఎన్ఆర్ మార్గ్, మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.
సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను షెయిలింగ్ క్లబ్ వద్ద కవాడిగూడ క్రాస్‌రోడ్, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ ఆలయం మీదుగా మళ్లిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఉద్యోగాలపై నిలదీస్తే దాడులు చేస్తారా?.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
Mens Fitness | పురుషుల ఫిట్నెస్ అంటే కేవలం కండరాలను పెంచుకోవడమే కాదు, ఇవి కూడా..!
Gadwal ADE | కాంట్రాక్టర్ నుంచి రూ.60వేలు లంచం.. గద్వాల ఏడీఈని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
Chemicals | మానవ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతున్న రసాయనాలు.. చర్యలు తీసుకోకపోతే మరిన్ని సమస్యలు తప్పవు..
ACB Raid | కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ విద్యుత్ ఏడీఈ
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

