హైదరాబాద్‌లో మరింత కఠినంగా ట్రాఫిక్ రూల్స్.. నేటి నుంచి ప్రత్యేక డ్రైవ్
Hyderabad | హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను
హైదరాబాద్: హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే భారీ ఫైన్లు తప్పవని హెచ్చరించారు. రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే పెద్దమొత్తం జరిమానాలు విధించనున్నారు. ఈ మధ్యకాలంలో నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులతో పాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో గత వారం రోజులుగా ఈ ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

రాంగ్ రూట్లో వచ్చే వాహనాలకు రూ.1700, ట్రిపుల్ రైడింగ్‌కు రూ.1200 వరకు ఫైన్ విధించనున్నారు. ఇక జీబ్రా లైన్ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుపడితే రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విధించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు చెప్పారు. భారీ వాహనాలు రాంగ్రూట్లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్‌లు, ఆటోలకు విధించే జరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని చెప్పారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాలైన బైక్‌లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంతో పోలిస్తే తక్కువగానే ఉంటాయని తెలిపారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడకుండా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

