Traffic alert | హైదరాబాద్‌లోని ఆ రూట్లో నేటి నుంచి 40 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల నేపథ్యంలో గాంధీ విగ్రహం వద్ద నుంచి అంబర్‌పేట టీ జంక్షన్ వరకు ఈ నెల 30వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు 40 రోజుల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రూట్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్తూ, పోలీసులకు సహకరించాలని సూచించారు. గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో (ఒకవైపు) వాహనాలను అనుమతించకుండా ఆంక్షలు విధించినట్టు చెప్పారు.
ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లైఓవర్, విద్యానగర్, ఫీవర్ దవాఖాన, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు వాహనాలను మళ్లించనున్నారు.
ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్పేట్ గేట్, అలీఖేఫ్ క్రాస్‌రోడ్స్,. 6 నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలను అనుమతిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

