TSPSC | హైదరాబాద్ : టీపీబీవో( Town Planning Building Overseer ), వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్( Veterinary assistant Surgeon ) పోస్టుల రాతపరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. జులై 8వ తేదీన టీపీబీవో రాతపరీక్షను ఆన్లైన్లో నిర్వహించనున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు జులై 13, 14 తేదీల్లో ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. రాతపరీక్షలకు వారం రోజుల ముందు హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ తెలిపింది. తదితర వివరాల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.