సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం

- సమాన పనికి సమాన వేతనం ఘనత కేసీఆర్‌దే
- టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్
- నేడు సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర ప్రారంభం
జనగామ చౌరస్తా, ఏప్రిల్ 6: ఉద్యోగుల సమాన పనికి సమాన వేతనం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ అన్నారు. మంగళవారం జనగామలోని ఓ ఫంక్షన్ హాలులో జరిగిన టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 11వ పీఆర్సీలో 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం సీఎం కేసీఆర్ ఉద్యోగుల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలకు నిదర్శనమన్నారు. 9,17,479 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన ముఖ్యమంత్రికి టీఎన్జీవోస్ రుణపడి ఉంటుందని తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడం గొప్పవిషయమని కొనియాడారు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరిస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా బుధవారం నాగార్జున సాగర్ నుంచి టీఎన్జీవోస్ బస్సు యాత్ర ప్రారంభిస్తున్నట్టు రాజేందర్ పేర్కొన్నారు. ఈ యాత్ర తెలంగాణలోని 33 జిల్లాల్లో కొనసాగుతుందని చెప్పారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి రాయకంటి ప్రతాప్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కోల రాజేశ్‌కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్, కార్యదర్శి రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

