బెజ్జూరులో పెద్దపులి కలకలం..
పెద్దపులి | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. జిల్లాలోని బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నది.

ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. జిల్లాలోని బెజ్జూరు మండలం గబ్బాయి అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నది. దీంతో స్థానికులను భయాందోళనకు గురవుతున్నారు. పులి దాడిలో ఒక ఆవు మృతి చెందగా.. మరో రెండు ఆవులకు తీవ్ర గాయాలయ్యాయి.
పులిని చూసిన పశువుల కాపర్లు చెట్టెక్కి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పెద్దపులి సంచారానికి సంబంధించి స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో పులికి సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. పులి పాద ముద్రల ఆధారంగా గాలిస్తున్నారు. కాగా, పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

