Nalgonda | నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడు కిడ్నాప్..
నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితమే ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవాఖానలోకి ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిన దుండగుడు.. అక్కడే ఉన్న మూడేండ్ల బాలుడిని ఎత్తుకెళ్లాడు.
నీలగిరి: నల్లగొండ (Nalgonda) పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడు కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. హాస్పిటల్ ఆవరణలో ఆడుకుంటున్న అబు అనే మూడేండ్ల బాబును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మంగళవారం సాయంత్రం దవాఖాన ఆవరణలో వెతికిన బాలుడి తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బాలుడిని ఒక వ్యక్తి మాయమాటలు చెబుతూ ఫోన్లో మాట్లాడిస్తూ తీసుకెళ్తున్నట్టుగా హాస్పిటల్ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డుల్లో నమోదైంది. హాస్పిటల్ నుంచి బాలుడిని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు. అయితే సీసీ కెమెరాల్లో దుండగుడు అక్కడికి వచ్చినట్టుగా ఎక్కడా కనబడలేదు. దీంతో బస్టాండ్ ఆవరణలో వెతికినా కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో బాలుడిని తీసుకెళ్తున్న ఫుటేజ్ లభ్యం కాలేదు. దీంతో బాలుడిని నల్లగొండ పట్టణంలోనే ఎక్కడో చోట దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దుండగుడి కోసం గాలిస్తున్నారు. కాగా, గత మూడేండ్లుగా బాధిత కుటుంబం శహమున్నిసాబేగం, అహ్మద్ దంపతులు తమ కొడుకు అబూతో కలసి దవాఖాన ఆవరణలోనే జీవనం సాగిస్తున్నప్పటికీ అక్కడి సిబ్బంది వారిని గుర్తించకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | అదరగొట్టిన ఆకాశ్ దీప్.. న్యూజిలాండ్ 356 ఆలౌట్, ఐదు వికెట్లతో చెలరేగిన భారత పేసర్
High Court | షెడ్డులేని కంపెనీకి 500 కోట్ల రుణమా.. ఎస్బీఐ తీరుపై విస్తుపోయిన హైకోర్టు?
Revanth Reddy | రేవంత్‌ను లెక్కచేయని అధికారులు.. కాళోజీ కళాక్షేత్రంపై సీఎం ఆదేశాలేవీ పట్టనట్టే.. ఇంకా అక్కడే కుడా సిబ్బంది!
Assembly Elections | 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
Manjeera Water | యథేచ్ఛగా మంజీర నీటి దోపిడీ.. అక్రమంగా వాడుకుంటున్న చార్మినార్ బ్రూవరీస్, గణేశ్ షుగర్స్ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

