‘బెక్కెం’ చరిత్ర ఇదే!
వనపర్తి జిల్లాలోని బెక్కెం గ్రామానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న చరిత్రను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం.. నేలబిల్కు, పెద్ద బిల్‌కు, గూడెం అనే మూడు గ్రామాలు కలిసి ఏర్పడ్డ పెద్ద గ్రామం బెక్కం.
- మార్జాలమూర్తి పేరుమీద ఏర్పడిన గ్రామం
- కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశీలన
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): వనపర్తి జిల్లాలోని బెక్కెం గ్రామానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న చరిత్రను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుర్తించారు. రెవెన్యూ రికార్డు ప్రకారం.. నేలబిల్కు, పెద్ద బిల్‌కు, గూడెం అనే మూడు గ్రామాలు కలిసి ఏర్పడ్డ పెద్ద గ్రామం బెక్కం. ఈ గ్రామాలు శ్రీశైలం రిజర్వాయర్ ముంపులో మునిగిపోగా, అవే పేర్లతో కొత్త గ్రామాలను ఒడ్డున నిర్మించుకున్నారు. మరోవైపు పూర్వం ఇక్కడ నరసింగయ్యపల్లె, గొల్లగూడెం అనే రెండు గ్రామాలు ఉండేవని చెప్తారు. వాటికి బెక్కం పేరు రావడం వెనుక ఓ కథ నానుడిలో ఉన్నది. స్థానిక తాటివనంలో పుట్ట మీద ఒక ఆవు పాలు కురిపిస్తుంటే పిల్లి ఆ పాలు తాగడం చూసినవారు పుట్టను తవ్వి చూడగా అందులో శివలింగం బయటపడ్డదట. ఆ లింగానికే గుడికట్టి ‘బెకేశ్వరుడు’ అని పేరుపెట్టి పూజించారు. బెకేశ్వరుడున్న నరసింగయ్యపల్లె బెకెం అయిందని చెప్పుకొంటారు. కన్నడంలో బెకు అంటే పిల్లి అని అర్థం.
ఆలయంలో అద్భుత శిల్పాలు
బెకెం గ్రామానికి ఆ పేరు రావడానికి కారణమని చెప్తున్న దేవతామూర్తిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు బైరోజు శ్యాంసుందర్, చంద్రశేఖర్ గుర్తించారు. గ్రామంలోని త్రికూటాలయ గోడగూటిలో పద్మంలో, ఉతుటాసన భంగిమలో కూర్చొని ఉన్న ద్విభుజి, కుడిచేతిలో తామర పుష్పంతో కనిపిస్తున్న దేవతకు కుడిపక వింజామరతో పరిచారిక ఉన్నది. ఈ దేవత కింద మార్జాలవాహనం మీద అర్ధ పద్మాసనంలో కూర్చున్న దేవత మార్జాల (పిల్లి) ముఖంతో కనిపిస్తున్నది. ఆమె కుడిచేతిలో గద లాంటి ఆయుధం కనిపిస్తుంది. ఇలా ఒకే విగ్రహంలో ఇద్దరు దేవతలు ఉండటం చాలా అరుదని చరిత్ర బృందం సభ్యులు తెలిపారు. ఈ విగ్రహంలో పైన కనిపిస్తున్న దేవత పార్వతి అని, కింద మార్జాల వాహిని చతుశ్షష్టి యోగినులలో ఒకరని, ఈ దేవత కారణంగానే బెకెంకు ఆ పేరువచ్చిందని విశ్లేషిస్తున్నారు. చారిత్రక ఆధారాలు సైతం దీనినే స్పష్టం చేస్తున్నాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Beckham Venugopal
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

