గత సంవత్సరం మా సంస్థకు నవరత్న హోదా లభించింది. ఆ ఉత్సాహంతో మా రుణాల పరిధిని మెట్రోరైల్వే ప్రాజెక్టులకు కూడా విస్తరించాలని నిర్ణయించుకొన్నాం. మేము ఫైనాన్స్ చేస్తున్న తొలి మెట్రోరైల్వే ప్రాజెక్టు హైదరాబాద్‌దే. ఈ ప్రాజెక్టు కోసం సుమారు రూ.13,500 కోట్లు రుణంగా ఇవ్వబోతున్నాం. దీనికి సంబంధించి రుణ ఒప్పం దం కుదుర్చుకొన్నాం. జూన్ నాటికి రుణ మొ త్తాన్ని హైదరాబాద్ మెట్రోకు విడుదల చేయబోతున్నాం. ఈ డీల్‌తో హైదరాబాద్ మెట్రోపై ఉన్న 40% మేర ఆర్థికభారం తగ్గనున్నది. హైదరాబాద్ మెట్రోరైలు అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదంపడుతుందని భావిస్తున్నాం.
– మనోజ్ కుమార్ దూబే , ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) సీఎండీ (25.05.2026)