Nalgonda | నల్లగొండలో దొంగల ముఠా హల్ చల్
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించింది.
నల్లగొండ: నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించింది. లక్ష్మి నివాస్ అపార్ట్మెంట్లోని కమ్యూనిటీ హాల్, జీ8 ఫ్లాట్ల తాళాలు పగలగొట్టారు. మొదటి అంతస్తు మొత్తం కలియతిరిగారు. నాలుగు ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లారు. అలాగే పక్కనే ఉన్న రెండు కాలనీల్లో దొంగలు తిరిగారు.
కొద్ది రోజుల కిందట.. అపార్ట్మెంట్ పక్కన ఉన్న కాలనీలో ఓ ఇంట్లో దొంగలు పడి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు. మంగళవారం రాత్రి మాత్రం నలుగురు దొంగల ముఠా సభ్యులు మాత్రం ఓ బస్త సంచిలో కత్తులు, ఆయుధాలు తీసుకొచ్చారు. వాటితోనే తలుపుల తాళాలు కట్ చేశారు. దొంగలు తిరుగుతున్న దృష్యాలు అపార్టుమెంట్లలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అపార్ట్మెట్లను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Nlg 1

Nlg 2
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

