TGCHE | ఫస్టియర్‌లో థియరీ.. సెకండియర్‌లో స్కిల్స్ బేస్డ్ లెర్నింగ్.. వినూత్నంగా డిగ్రీ కోర్సులు
మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం(ఎక్స్పీరియన్షిల్ లెర్నింగ్). ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
- థర్డియర్‌లో ఎక్స్పీరియన్షిల్ లెర్నింగ్
- డిగ్రీకి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిన ఉన్నత విద్యామండలి
- సిలబస్, కోర్సుల స్వరూపంలో సమూల మార్పులు
TGCHE | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మొదటి సంవత్సరంలో థియరీ క్లాసులు, రెండో సంవత్సరంలో స్కిల్లింగ్.. మూడో సంవత్సరంలో అనుభవపూర్వకమైన అభ్యసనం(ఎక్స్పీరియన్షిల్ లెర్నింగ్). ఇలా వినూత్నంగా డిగ్రీ కోర్సులను కొత్తపుంతలు తొక్కించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. డిగ్రీ కోర్సుల స్వరూపంలో సమూల మార్పులు చేసింది. పూర్తిగా తరగతి బోధన విధానానికి ముగింపు పలకనుంది. విద్యార్థులు డిగ్రీలు పుచ్చకుంటున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం లభించడంలేదు. కేవలం అడ్మిషన్ దొరికితే చాలు. పరీక్షలు రాస్తే సరి. మూడేండ్లల్లో డిగ్రీ సర్టిఫికెట్ చేతికొచ్చేస్తుంది. ఫలానా కోర్సు పూర్తిచేస్తే.. ఫలానా కొలువు లభిస్తుందన్న గ్యారెంటీని మన విద్యావిధానం ఇవ్వలేకపోతున్నది. దీంతో కాలేజీలు నిరుద్యోగులను తయారుచేసే కార్ఖానాల్లా తయారయ్యాయి. ఈ విధానానికి ముగింపు పలికేందుకు ఉన్నత విద్యామండలి చేస్తున్న కసరత్తు కొలిక్కి వచ్చింది. ఇందుకోసం కామన్ కరిక్యులాన్ని సిద్ధంచేస్తున్నది. ఇప్పుడున్న సిలబస్‌లో భారీ మార్పులు చేస్తూ.. 30శాతం మార్చనుంది. 2025 మార్చిలోపు కామన్ కరిక్యులాన్ని సిద్ధం చేసి, జూన్‌లో ప్రవేశపెట్టనుంది.
రోడ్‌మ్యాప్‌లోని ముఖ్యాంశాలు..
- రాష్ట్రంలోని అన్ని పబ్లిక్ యూనివర్సిటీలకు కామన్ కరిక్యులం ఫ్రేమ్‌వర్క్, కామన్ క్రెడిట్ సిస్టంను అమలు చేస్తారు. క్రెడిట్స్‌ను ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి మార్చుకునే వెసులుబాటును కల్పిస్తారు.
- యూజీ ప్రోగ్రాముల్లో మూడో సెమిస్టర్ నుంచే పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలను నేర్పిస్తారు. వొకేషనల్ ఎడ్యుకేషన్ మాడ్యూల్స్‌ను ప్రవేశపెడతారు.
- డిగ్రీ కోర్సుల్లో పరిశ్రమలు ఆశించిన (ఇండస్ట్రీ ఒరియెంటెడ్) కరిక్యులాన్ని ప్రవేశపెడతారు. విద్యార్థులు పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది.
- అంత్రప్రెన్యూర్షిప్ను అభివృద్ధి చేసేందుకు టీహబ్‌లో, బయో సైస్సెస్ కోసం ఐకేపీ నాలెడ్జ్పార్క్లను ఇండస్ట్రీ స్పెసిఫిక్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తారు.
- రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అసమానతలను రూపుమాపేందుకు స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్(ఎస్ఈజెడ్)ను ఏర్పాటు చేస్తారు. వీటిని విద్యాపరంగా వెనుకబడిన జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు.
- విదేశీ వర్సిటీల సహకారంతో డ్యూయల్ డిగ్రీ, జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తారు. ప్రతి వర్సిటీలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు.
- ఆన్లైన్ యూజీ, పీజీ ప్రోగ్రాములను పెద్ద ఎత్తున అందుబాటులోకి తీసుకొస్తారు. కమ్యూనిటీ బేస్డ్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. క్లాసులు ఆన్లైన్లో నిర్వహించినా, ఈ కోర్సుల్లోని వారికి ఇంటర్న్‌షిప్‌లుంటాయి. దీంతో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా కోర్సుల అధ్యయనంతోపాటు ఇంటర్న్‌షిప్‌ల ద్వారా సంపాదిస్తారు.
- రాష్ట్రంలో అత్యధికులు స్కాలర్‌షిప్‌ల ఆధారంగా చదువుకుంటున్నారు. స్కాలర్‌షిప్‌ల ద్వారానే విద్యార్థులకు చదువు అందుతున్నది. దీనిని సమూలంగా మార్చుతారు. అంతర్జాతీయ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకుంటారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

