Minister Gangula | వారి సేవలు వెలకట్టలేనివి : మంత్రి గంగుల
Minister Gangula | కరోనా రోగులకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అందించిన సేవలు వెలకట్టలేనివని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

కరీంనగర్ : కరోనా రోగులకు వైద్య ఆరోగ్య సిబ్బంది ప్రాణాలకు తెగించి అందించిన సేవలు వెలకట్టలేనివని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కొత్తపల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బందికి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ..రాష్ట్రంలో కొవిడ్ టీకా ముందు జాగ్రత్త ( బూస్టర్) డోసులను సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకొని 9 నెలలు పూర్తయిన వారు బూస్టర్ డోసు కు అర్హులు అని తెలిపారు.

ప్రస్తుతం వైద్య ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ సిబ్బంది, 60 ఏళ్లు పైబడి ఉన్నవారికి బూస్టర్ డోస్ అందిస్తున్నామని వివరించారు. ఎలాంటి వ్యాధులు లేని 60 ఎండ్లు పై బడిన వారికి వచ్చే నెల నుంచి ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జూవేరియా, డిప్యూటీ డీఎంహెచ్ ఓ సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, పీ ఎచ్సీ వైద్యులు రమేష్, వంశీ, ఏఎన్ఎం లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

