నేటినుంచి థియేటర్లు బంద్

రాష్ట్రంలోని సినీ పంపిణీదారులు, ప్రదర్శనదారుల స్వచ్ఛంద నిర్ణయం
బార్లు 8 గంటలకే మూత.. వైన్ షాపులు, రెస్టారెంట్లు కూడా..
సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు
మళ్లీ థియేటర్లు మూతపడ్డాయి. కరో నా విజృంభిస్తున్న తరుణంలో బుధవారం నుంచి థియేటర్లను మూసివేయాలని సినీ పంపిణీ, ప్రదర్శనదారులు స్వచ్ఛందంగా నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయించినట్టు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రకటించారు. కొవిడ్ వ్యాప్తి కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి భయపడుతుండటంతో నిర్వహణ వ్యయాలు రా బట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని, అందువల్లే థియేటర్లను మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. స్వచ్ఛంద మూసివేత నుంచి ‘వకీల్‌సాబ్’ సినిమాను ప్రదర్శించే థియేటర్లను మినహాయిస్తున్నట్టు ప్రదర్శనదారులు ప్రకటించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
అంతకుముందు కర్ఫ్యూ నేపథ్యంలో సినిమా థియేటర్లు రాత్రి 8 గంటలకే మూ సివేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. నిబంధనలు అమలుచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలను ఆదేశించారు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు, థియేటర్లలో పనిచేసే సిబ్బంది, వెండర్లు విధిగా అన్ని సమయాల్లో మాస్క్‌లు ధరించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- bars
- restaurants
- Theatres
- wines
RELATED ARTICLES
తాజా వార్తలు
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
Dakshinamukhi Anjaneya Swamy | పార్డి (కె) గ్రామంలో ముగిసిన అఖండ హరినామ తాళ సప్తహ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

