ముందుకు సాగని బదిలీలు!
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖకు సంబంధించిన బదిలీల మార్గదర్శకాలే ఇంకా జారీ కాలేదు.
- విద్యాశాఖలో ఇంకా విడుదల కాని మార్గదర్శకాలు
- గడువు పొడిగింపు కోరే యోచనలో అధికారులు
హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖకు సంబంధించిన బదిలీల మార్గదర్శకాలే ఇంకా జారీ కాలేదు. ఇంటర్మీడియట్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల్లో లెక్చరర్లు, ఉద్యోగులు బదిలీల ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీంతో ఈ నెల 20లోపు బదిలీలు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఉద్యోగులకు సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఈ నెల 3న సర్కారు జీవో జారీ చేసిన విషయం తెలిసిందే.
16 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యేలా ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసింది. ప్రక్రియంతా పూర్తయ్యి ఈ నెల 19, 20 తేదీల్లో బదిలీల ఉత్తర్వులు విడుదల కావాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు విద్యాశాఖలోని పలు హెచ్వోడీల్లో మార్గదర్శకాలే విడుదల కాలేదు. దీంతో బదిలీలు సకాలంలో జరుగుతాయా? లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికిప్పుడు మార్గదర్శకాలు విడుదలైతే ప్రక్రియ పూర్తయ్యేందుకు 10 రోజులు పడుతుంది. ఈ నేపథ్యంలో మరో 5 రోజులు గడువు పొడగించాలని కోరనున్నట్లు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

