వెల్గటూర్, అక్టోబర్ 12: ఎన్నికల్లో పంచేందుకు అక్రమంగా నిల్వ ఉంచిన చీరలను వెల్గటూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో పాత సూర్యనారాయణ ఇంట్లో అక్రమంగా చీరలు నిల్వ ఉంచారని పోలీసులకు పక్కా సమాచారం అందింది.
ఈ మేరకు గురువారం దాడులు చేయగా.. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.80,550 విలువైన 179 చీరలు ఉన్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల్లో ప్రజలకు పంచేందుకు నిల్వ ఉంచారని విచారణలో వెల్లడైనట్టు ఎస్సై శ్వేత తెలిపారు. సూర్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.