రంగారెడ్డి : ప్రీ వెడ్డింగ్ షూట్ ఆ రెండు కుటుంబాల్లో సంతోషాలకు బదులు కన్నీళ్లను మిగిల్చింది. ఏడడుగుల బంధాన్ని మధుర జ్ఞపకాలుగా మిగిల్చుకునేందుకు ఆ కాబోయే జంట చేపట్టిన ప్రీ వెడ్డింగ్ వారి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఈ విషాదకర సంఘటన వారి జీవితాల్లో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.
వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని అబ్దుల్లా పూర్మెట్ మండలం కొహెడ గ్రామంలో ప్రీ వెడ్డింగ్ షూట్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్న సమయంలో షూట్ ఎఫెక్టివగ్ ఉండటం కోసం పొగ పెటడంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురుపై తేనెటీగలు దాడి చేశాయి. బాధితులు హైదరాబాద్‌లోని మాలక్‌పేట యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రీ వెడ్డింగ్ షూట్‌ను అడవుల్లో చేసుకోవాలనుకునే వారు వేసవి కాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.