మాజీ ఎమ్మెల్యేపై దాడికి దుండగుడు యత్నం.. పోలీసులకు అప్పగింత
సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసున పై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ఒకరు దాడికి యత్నించాడు. గోడ దూకి ఇంట్లోకి
హైదరాబాద్ : సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసున పై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు ఒకరు దాడికి యత్నించాడు. గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడిని కాట్రగడ్డ ప్రసున, కూతురు కరణం అంబికా కృష్ణ పట్టుకుని చితకబాది ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. రాజకీయ కక్షల కారణంగానే తమపై దాడియత్నం జరిగిందని ప్రసున తెలిపారు. గతంలోనూ పలుమార్లు ప్రకాశం జిల్లా పోలీసులకు సైతం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. తమకు ప్రాణహాని ఉందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
కాగా ఇంట్లోకి చొరబడ్డ దుండగుడు ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై స్పందించిన ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యేపై దాడిఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పారు. దుండగుడు సమీపంలో ఉన్న మద్యం మత్తులో ఇంటి గోడ దూకాడని, ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

