హైదరాబాద్, అక్టోబర్ 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 15,750 కానిస్టేబుల్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ప్రకటించింది. మొత్తం 16,604 ఖాళీలకు 12,866 మంది పురుషులు, 2,884మంది మహిళా అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిపింది.
ఎంపికైనవారు ఈ నెల 12, 13న సంబంధిత ధ్రువపత్రాలు జతచేసిన అటెస్టేషన్ ఫాంను పూర్తిచేసి సంబంధిత జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని సూచించింది. 100 డ్రైవర్ పోస్టులు, 225 ఫైర్ సర్వీసెస్ డ్రైవర్ పోస్టులకు సంబంధించి కోర్టు కేసు పరిష్కారం తరువాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు వివరించింది.