SI results | వచ్చే నెలలోనే ఎస్సై ఫలితాలు.. కానిస్టేబుల్ అభ్యర్థులకు సెప్టెంబర్‌లో
రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. దీన్నిబట్టి ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
- 28 కేంద్రాల్లో శిక్షణ ప్రారంభం
SI results | హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ముమ్మరం చేసింది. దీన్నిబట్టి ఆగస్టులో ఎస్సై, సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ద్వారా 90,175 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్సై, ఏఎస్సై పోస్టులు 587 ఉన్నందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. దీంతో ఆగస్టులోనే ఎస్సై అభ్యర్థులకు శిక్షణ ప్రారంభంకానున్నట్టు విశ్వసనీయ సమాచారం.
16,929 కానిస్టేబుల్ అభ్యర్థుల తుది జాబితాను సెప్టెంబర్ నాటికి సిద్ధమైతే.. అదే నెల చివరిలో లేదా అక్టోబర్ మొదటివారంలో శిక్షణ కార్యక్రమాలు ఉంటాయని తెలిసింది. ప్రస్తుతం ప్రొవిజనల్ ఎంపికకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ప్రక్రియ కూడా వేగవంతం చేయనున్నట్టు తెలిసింది. ఆ వెంటనే క్యారెక్టర్ అండ్ యాంటిస్పెంట్ వెరిఫికేషన్(ఎస్బీ), మెడికల్ ఫిట్నెస్ కూడా రెండు మూడు వారాల వ్యవధిలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తున్నది. ఇవి పూర్తయిన వెంటనే కటాఫ్ మార్కులు ప్రకటించి, అర్హులైన అభ్యర్థుల తుది జాబితాను వెల్లడించనున్నట్టు తెలిసింది. కాగా, కొత్తగా నియామకమయ్యే పోలీసు అభ్యర్థులకు రాష్ట్రంలోని 28 శిక్షణా కేంద్రాలు సిద్ధమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
High Fibre Jelly | జీర్ణక్రియకు మేలు చేసే ఫైబర్ జెల్లీ.. తయారీ ఇలా..
Arrest | ముంబైలో అనుమానిత జైషే మహమ్మద్ ఉగ్రవాది అరెస్ట్..!
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

